
తెలుగులో ‘చిల’ సౌ, హిట్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది రుహానీ శర్మ. ప్రస్తుతం ఆమె వెంకటేష్ ‘సైంధవ’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయిక. రుహానీ శర్మ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంలో డా.రేణుగా రుహాని శర్మ నటిస్తోంది. ఆమె పాత్ర విభిన్న భావోద్వేగాల కలయికగా ఉంటుంది. కథలో డా. రేణు పాత్ర కీలకంగా ఉంటుంది’’ అని చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం వైజాగ్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. డిసెంబర్ 22న విడుదల కానుంది. కెమెరా: ఎస్.మణికందన్, సంగీతం: సంతోష్ నారాయణ్, స్క్రీన్ రైటర్: శైలేష్ కొలాన.
