డెంగ్యూ మహమ్మారి కారణంగా వందకు పైగా మునిసిపాలిటీల్లో హెల్త్ ఎమర్జెన్సీ విధించినట్లు పెరూ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు 32 మంది మృతి చెందారు. 2024 మొదటి వారం రోజుల్లోనే డెంగ్యూ కేసులు గతేడాది కంటే రెట్టింపయ్యాయని పెరూ ఆరోగ్య మంత్రి సీజర్ వాజ్క్వెజ్ తెలిపారు. ప్రస్తుతం దేశంలో 18,000కు పైగా డెంగ్యూ కేసులు ఉన్నాయి.
ఉత్తర థంబేస్ ఉత్తర ప్రావిన్సు, పియూరా, లా లిబర్టెడ్, లాంబాక్యూ, అంకాష్ అండ్ కాజ్‌మార్కా, ఐకా దక్షిణ ప్రావిన్సుతో పాటు అయాకుచో, కుస్కో అండ్ పునో, హౌనాకో సెంట్రల్ ప్రావిన్స్ తో పాటు జునిన్, పాస్కో, లిమా, కాల్లో, అమెజానియన్ ప్రావిన్స్ లైన లరెటో, మాడ్రిడ్ డి డియాస్, సాన్ మార్టిన్ అండ్ యుకాయలి ప్రాంతాల్లో వైద్య అత్యవసర పరిస్థితి విధించినట్లు సీజర్ వాజ్క్వెజ్ చెప్పారు.
జాతీయ అత్యవసర పరిస్థితిని విధించమని కోరడంలో తప్పులేదని పెరూ మెడికల్ కాలేజ్ డీన్ రౌల్ ఉర్కిజో చెప్పారు. ఎమర్జెన్సీ ప్రకటించడంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ అలసత్వంగా వ్యవహరించిందన్నారు. ఈ 2024లో డెంగ్యూ లాటిన్ అమెరికాకు ప్రాణాంతకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) ప్రకటించింది.
ఇది కూడా చదవండి:బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ .. నలుగురు మావోయిస్టులు మృతి
