బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ గత కొన్ని రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారు. అనారోగ్యం కారణంగా ఆయన చిత్రీకరణను నిలిపివేశారు. దాంతో ఇంట్లోనే చికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం డెంగ్యూ జ్వరం నుంచి సల్మాన్ క్రమంగా కోలుకుంటున్నాడు. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం “కిస్ కా భాయ్ కిసీ కా జాన్” సినిమాలో నటిస్తున్నాడు. ఈ నెల 25న ప్రారంభం కానున్న ఈ సినిమా చిత్రీకరణలో ఆయన పాల్గొననున్నారు.
ఈ సినిమా కోసం భారీ సెట్‌ను వేసినప్పటికీ సల్మాన్‌కి డెంగ్యూ జ్వరం రావడంతో చిత్రీకరణ ఆగిపోయింది. సల్మాన్ సినిమాపై దృష్టి పెట్టాడు. అలాగే అనారోగ్యం కారణంగా సల్మాన్ ఖాన్ ఈ ఏడాది దీపావళి పార్టీలకు హాజరుకాలేదు.