లేఆఫ్స్ తగ్గుముఖం పట్టి కొత్త ఏడాది ఉద్యోగాలు వస్తాయని ఆశించిన వారికి నిరాశ ఎదరువుతోంది. దిగ్గజ కంపెనీల నుంచి స్టార్టప్‌ల వరకూ ఆర్ధిక మందగమనం, వ్యయ నియంత్రణ చర్యలు, పునర్వ్యవస్ధీకరణ వంటి పేర్లతో ఉద్యోగులను తొలగిస్తున్నారు.
లేటెస్ట్ గా ప్రముఖ డేటింగ్ యాప్ బంబుల్ 350 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది. రాబడి లేకపోవడంతో ఖర్చులకు తగ్గించుకునే క్రమంలో కొలువుల కోత తప్పదని స్పష్టం చేసింది. ఉద్యోగులను తొలగించనున్నట్టు బంబుల్ చెప్పడంతో కంపెనీ షేర్ ధరలు ఏకంగా ఏడు శాతంపైగా నష్టపోయాయి.
మ్యాచ్ గ్రూప్ నుంచి బంబుల్ తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది. తమ యాప్స్ ను యువత వాడేందుకు బంబుల్ ప్రత్యర్ధులతో దీటైన పోటీ ఎదుర్కొంటోంది. ఇక టారిఫ్‌లు పెరగడంతో ప్రజలు ఖర్చు చేసేందుకు తటపటాయించడం కూడా కంపెనీని ఆర్ధిక కష్టాల్లోకి నెట్టింది. గడ్డుపరిస్ధితుల నేపధ్యంలో ఉద్యోగులను తగ్గించక తప్పని పరిస్ధితి బంబుల్ సీఈవో లిడియన్ జోన్స్ కు ఎదురైంది.
ఇది కూడా చదవండి: పదేండ్ల డేటింగ్ తర్వాత ప్రియుడిని పెళ్లి చేసుకోబోతున్న తాప్సీ
