పువ్వులు చూడటానికి సున్నితంగా కనిపిస్తాయి. మానవుడికి తెలిసిన సుమారు 3,50,000 జీవుల్లో అత్యంత విజయవంతంగా పరిణామం చెందినవాటిలో పూల మొక్కలు కూడా ఉన్నాయి.

బ్రిస్టల్: పువ్వులు చూడటానికి సున్నితంగా కనిపిస్తాయి. మానవుడికి తెలిసిన సుమారు 3,50,000 జీవుల్లో అత్యంత విజయవంతంగా పరిణామం చెందినవాటిలో పూల మొక్కలు కూడా ఉన్నాయి. ఇవి పర్యావరణ వ్యవస్థపై ఆధిపత్యం చలాయిస్తాయి, ఆక్సిజన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తాయి.
పూల మొక్కలు 1.70 కోట్ల సంవత్సరాల నుంచి 12.5 కోట్ల సంవత్సరాల పూర్వం డైనోసార్ల(రాక్షస బల్లులు)తోపాటు పరిణామం చెందినట్లు తాజా అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. డైనోసార్లు అంతరించినప్పటికీ పూల మొక్కలు నేటికీ నిలిచి ఉన్నాయని తెలిపింది. భూమిపై జీవుల పరిణామం గురించి తెలుసుకోవడానికి పువ్వుల సృష్టికి సంబంధించిన అధ్యయనాలు ఉపయోగపడతాయని చెప్పింది.