Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
తాజా వార్తలు

ఢిల్లీలో రూ. 2 వేల కోట్ల డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టురట్టు

TelanganapressBy TelanganapressFebruary 25, 2024No Comments

దేశంలో మరో భారీ డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టురట్టయ్యింది. ఢీల్లీ పోలీసులు, ఎన్‌సీబీ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో అంతర్జాతీయ డ్రగ్‌ నెట్‌వర్క్ ను అధికారులు చేధించారు. ఈ వ్యవహారంలో తమిళనాడులోని ఓ ప్రముఖ సినీ నిర్మాత కీలక సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడు పరారీ ఉన్నట్లు తెలుస్తోంది.

సూడోపెడ్రిన్‌కు ఇతర దేశాల్లో డిమాండ్‌ ఎక్కువ. మెథాంఫేటమిన్ తయారీలో దీన్ని వినియోగిస్తారు. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలో కిలో రూ. 1.5 కోట్లకు అమ్ముతారు. ఆ దేశాలకు పెద్ద మొత్తంలో సూడోపెడ్రిన్‌ పంపుతున్నట్లు ఎన్‌సీబీ సమాచారం అందుకుంది. దీనిని హెల్త్‌ మిక్స్‌ పౌడర్స్‌, కొబ్బరి సంబంధిత ఆహార ఉత్పత్తులతో కలిపి సముద్ర మార్గాల్లో రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఈ డ్రగ్‌ మాఫియా కదలికలపై ఎన్‌సీబీ నిఘా పెట్టింది.

ఈ క్రమంలోనే సరకును ఆస్ట్రేలియాకు పంపడానికి ప్రయత్నిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఫిబ్రవరి 15న పశ్చిమ దిల్లీలోని దారాపుర్‌లోని గోదాంలో తనిఖీ చేపట్టారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి 50 కిలోల సూడోపెడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెట్‌వర్క్‌ భారత్‌ సహా మలేషియా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలకు విస్తరించినట్లు విచారణలో తేలింది.

ఈ ముఠా ఇప్పటి వరకు 3,500 కిలోల సూడోఫెడ్రిన్‌తో ఉన్న 45 పార్శిళ్లను ఎగుమతి చేశారని.. దీని విలువ రూ. 2 వేల కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు. ఈ వ్యవహారంలో తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ప్రస్తుతం పరారీలో ఉన్న అతడిని పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే అతడి ఫొటోను విడుదల చేస్తామని పోలీస్‌ అధికారులు చెప్పారు.

ఇది కూడా చదవండి: అందరికీ 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అన్న సీఎం రేవంత్.. ఇప్పుడు కొందరికే అంటున్నడు

Source link

Telanganapress
  • Website

Related Posts

ఎన్నికల తర్వాత బీజేపీలోకి సీఎం రేవంత్..గులాబీ బాస్ సంచలన వ్యాఖ్యలు..!

April 16, 2024

మామిడి పండు తినే అరగంట ముందు ఈ పనిచేయండి..!

April 16, 2024

గీత దాటితే వేటే..ప్రభుత్వ సలహాదారులకు ఈసీ వార్నింగ్..!

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.