ఢిల్లీ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది ఆప్ సర్కారు. 18 ఏళ్లు దాటిన ఢిల్లీ మహిళలకు ప్రతి నెలా వెయ్యి రూపాయిలు ఇవ్వనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక మంత్రి అతిషి ఇవాళ(సోమవారం) రూ. 76,000 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 15న ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు మార్చి 8 వరకు కొనసాగనున్నాయి. ఆప్ ప్రభుత్వ చరిత్రలో అత్యంత దీర్ఘకాలం కొనసాగిన అసెంబ్లీ సమావేశాలు ఇవే కానున్నాయని అధికారులు తెలిపారు. గతేడాది మార్చిలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అతిషి ఇవాళ మొదటి సారి బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజనా పథకం కింద 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సున మహిళలకు నెలకు వెయ్యి రూపాయిలు ఇవ్వనున్నట్లు అతిషి బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. విద్యారంగానికి రూ.16,369 కోట్లు, ఆరోగ్య రంగానికి రూ. 8.685 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: కర్ణాటకలో విద్యార్థినిపై యాసిడ్ దాడి
The post ఢిల్లీ మహిళలకు ఆప్ సర్కారు గుడ్ న్యూస్ appeared first on tnewstelugu.com.
