తమిళనాడులో డీఎంకే నేత, మంత్రి సెంథిల్ బాలాజీపై ఐటీ దాడులు రెండో రోజు కూడా కొనసాగాయి. శనివారం సెంథిల్ సోదరుడు, అతని సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. కరూర్, చెన్నై, కోయంబత్తూరులో ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి.

తమిళనాడులో డీఎంకే నేత, మంత్రి సెంథిల్ బాలాజీపై ఐటీ దాడులు రెండో రోజు కూడా కొనసాగాయి. శనివారం సెంథిల్ సోదరుడు, అతని సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. కరూర్, చెన్నై, కోయంబత్తూరులో ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. టాస్మాక్ ఔట్‌లెట్లలో అక్రమాలపై అన్నాడీఎంకే, బీజేపీలు గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ దాడి జరిగింది.
మంత్రి సెంథిల్, ఆయన సన్నిహితుల ఇళ్లలో తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ఐటీ సోదాలు జరిగాయి. అయితే ఫ్యాక్షన్ ప్రాతిపదికన దాడులు చేస్తున్నారని ఐటీ అధికారులను డీఎంకే సిబ్బంది నిలదీశారు. అధికారుల కార్ల అద్దాలు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో శనివారం సీఆర్పీఎఫ్ యూనిట్ ఐటీ అధికారులకు భద్రత కల్పించడం గమనార్హం.
