వేసవిలో గ్రా మ, పట్టణాల్లో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రవినాయక్ తెలిపారు. సోమవా రం సమీకృత కలెక్టర్ కార్యాలయంలో తాగునీటి సమస్యపై మండల ప్రత్యేక అధికారులు ఎంపీడీవోలు, మిషన్ భగీరథ ఏఈ, డీఈలు, ఎంపీవోలతో కలెక్టర్ రవినాయక్ వెబెక్స్ ద్వారా సమీక్షించారు.
- మహబూబ్‌నగర్ కలెక్టర్ రవినాయక్
మహబూబ్‌నగర్ అర్బన్, ఏప్రిల్ 15 : వేసవిలో గ్రా మ, పట్టణాల్లో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రవినాయక్ తెలిపారు. సోమవా రం సమీకృత కలెక్టర్ కార్యాలయంలో తాగునీటి సమస్యపై మండల ప్రత్యేక అధికారులు ఎంపీడీవోలు, మిషన్ భగీరథ ఏఈ, డీఈలు, ఎంపీవోలతో కలెక్టర్ రవినాయక్ వెబెక్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్‌డీఎఫ్ ద్వారా తాగునీటికి సంబంధిం చి బోర్‌వెల్, మోటర్, పైప్‌లైన్ పనులను వారం రోజు లో పూర్తి చేయాలన్నారు. తాగునీటికి సమస్యలు ఉన్నచోట బోర్ వెల్ ఏర్పాటు చేసి, మోటరు బిగించాలని తెలిపారు. నీటి సమస్యలపై ఏఈ, డీఈలు క్షేత్రస్థాయి లో పర్యవేక్షించి ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. భూగర్భజలాల నివేదిక ప్రకారం బోర్లను ఫ్లషింగ్ డిపెనింగ్, గేట్‌వాల్స్, మోటర్లు, చేతిపంపులు, పైప్‌లైన్ లీకేజీ వంటివి మరమ్మతు చేయాలని ఆదేశించారు. గ్రా మ, పట్టణాల్లో మిషన్ భగీరథ ద్వారా సరఫరా అయ్యే నీటిని ఎలాంటి ఇబ్బంది లేకుండా, క్రమం తప్పకుం డా సరఫరా చేయాలని తెలిపా రు. నీటి ట్యాంక్‌లను బ్లీచింగ్ పౌ డర్‌తో క్లోరినేషన్ చేయాలని, నల్లాల ద్వారా వచ్చే నీటిని వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో తాగునీ టి సరఫరాపై రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు. మొక్క లు ఎండిపోకుండా కాపాడాలని, పల్లె ప్రకృతి వనాలు, అవెన్యూ, బ్లాక్ ప్లాంటేషన్ మొక్కలకు, జం తువులకు నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. కార్యక్రమం లో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్‌రావు, డీపీవో వెంకటేశ్వర్లు, డీఆర్‌డీవో నర్సింహులు, ఏఈ, డీఈలు పాల్గ్గొన్నారు.
పనులు పూర్తి చేయాలి
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రభుత్వం పాఠశాల మౌలిక వసతుల కల్పన, మరమ్మతు పనులు జూన్ 21లో పు నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్ రవినాయక్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ తమ ఛాంబర్‌లో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో తాగునీటి సౌకర్యం, తరగతి గదుల మరమ్మతు, నిరుపయోగంగా ఉన్న టాయిలెట్లు ఉపయోగంలోకి తీసుకురావలని సూచించారు. బాలికల కోసం నూతనంగా అదనపు టా యిలెట్లు నిర్మించాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డీఆర్‌డీవో నర్సింహులు, విద్యాధికారి రవీందర్ పాల్గ్గొన్నారు.