తల్లిని, జన్మస్థలాన్ని మరువవద్దని పెద్దలు చెబుతారు. అలాగే రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ తాను జన్మించిన పేట్ల బుర్జు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి కోటి రూపాయలు కేటాయించారు. ఆసుపత్రిని గుర్తుపెట్టుకుని అభివృద్ధికి నిధులు కేటాయించిన ఘనత మంత్రి హరీశ్ రావుదేనన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ తీసుకున్న నిర్ణయం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందని, ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి దోహదపడుతుందన్నారు.
మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ పెట్ల బుర్జు ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసేందుకు నిధులను వినియోగిస్తామన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ స్ఫూర్తితో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టిన వారు ఈ ఆసుపత్రుల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ నిధులను పేట్ల బుర్జు ఆసుపత్రి అవసరాలు, సౌకర్యాలకు వినియోగించాలని డీన్‌ను ఆదేశించారు.