హైదరాబాద్ తార్నాక కిమ్టీ కాలనీలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. క్షణాల మీద వ్యాపించిన మంటలతో కాలనీ వాసులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాదసమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. విషయం తెలుసుకున్న నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని, వెంటనే అగ్నిమాపక సిబ్బందిని పిలిపించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆస్తినష్టం సంభవించిందని అధికారులు తెలిపారు.ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో పై నిషేధం
