తిరుపతి |తిరుపతిలోని శ్రీనివాసమంగాపురం కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జూన్ 24 నుంచి 26వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల సాక్షాత్కార మహోత్సవం జరగనుంది.

తిరుపతి: తిరుపతిలోని శ్రీనివాసమంగాపురం కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జూన్ 24 నుంచి 26 వరకు శ్రీవారి సాలకట్ల సాక్షాత్కార మహోత్సవం జరగనుంది. దీన్ని అవకాశంగా తీసుకుని జూన్ 22, 24-27 తేదీల్లో ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారికంగా ప్రకటించింది. 22న వైభవోత్సవం సందర్భంగా ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు వారు వివరించారు.
ఇందులో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామివారికి ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు మూడు రోజుల పాటు స్నపనతిరుమంజనం నిర్వహించనున్నారు. 24న పెద్ద శేష వాహనం, జూన్ 25న హనుమంత వాహనం, జూన్ 26న స్వామివారు గరుడవాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు భక్తులకు దర్శనమిస్తారు.
27వ తేదీ ఉదయం 7 గంటలకు శ్రీవారిమెట్టు సమీపంలోని మండపంలో పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా జూన్ 22న తిరుప్పావడసేవ, జూన్ 24-27 తేదీల్లో ఆర్జిత కల్యాణోత్సవం సేవలను రద్దు చేశారు.

