
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 9 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 15 గంటల్లో దర్శనం కల్పిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారిని 67,439 మంది భక్తులు దర్శించుకోగా, 29,450 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించే కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.60 లక్షలుగా వెల్లడించింది.
నిన్న భువనేశ్వర్‌కు చెందిన శివమ్ కందేవ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు రాఘవేంద్ర ప్రదాన ట్రస్టుకు రూ.లక్ష విరాళం అందించగా, విరాళం చెక్కును తిరుమలలో ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. సంస్థ తరపున ఇప్పటి వరకు రూ.3 కోట్ల విరాళం అందజేసినట్లు రాఘవేంద్ర తెలిపారు. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడకు చెందిన తులసమ్మ, ఈశ్వర్ రెడ్డి దంపతులు టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.550000 విరాళంగా అందజేశారు.
816238