కలియుగ వైకుంఠంగా పేరొందిన ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల ఇప్పటికీ భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయి స్వామివారి దర్శనానికి వేచి ఉన్నాయి.

టోకెన్లు లేని భక్తులు సర్వ దర్శనానికి 30 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న ఒక్కరోజే 67,468 మంది తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 36,082 మంది తలనీలాలు సమర్పించారు. భక్తులు కానుకల ద్వారా అందించిన హుండీకి నిన్న ఒక్కరోజే రూ.416 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
