Begumpet | గుర్తు తెలియని అగంతకుడు ఇంట్లోకి చొరబడి తుపాకీతో బెదిరింపులకు దిగాడు. తలకు హెల్మెట్ ధరించి ఇంట్లోకి ప్రవేశించగా తల్లీ కూతుళ్లు దుండగుడితో వీరోచితంగా పోరాటం చేసి తరిమికొట్టారు.
Begumpet | గుర్తు తెలియని అగంతకుడు ఇంట్లోకి చొరబడి తుపాకీతో బెదిరింపులకు దిగాడు. తలకు హెల్మెట్ ధరించి ఇంట్లోకి ప్రవేశించగా తల్లీ కూతుళ్లు దుండగుడితో వీరోచితంగా పోరాటం చేసి తరిమికొట్టారు. నిందితుడు దాడి చేస్తూ తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఎంతో చాకచక్యంతో తుపాకీని లాక్కొని నిందితుడిని తరిమికొట్టారు. ఈ ఘటన హైదరాబాద్ బేగంపేటలోని రసూల్‌పుర జైన్‌కాలనీలో గురువారం చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. బేగంపేటలో తల్లీకూతుళ్లు ఇద్దరూ నివసిస్తున్నారు. దుండగుడు తలకు హెల్మెట్ పెట్టుకుని ఇంట్లోకి ప్రవేశించాడు.
ఆ తర్వాత బ్యాగులోని తుపాకీని తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు. దాంతో ఒక్కసారిగా తల్లీకూతుళ్లు ఇద్దరు షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత వెంటనే తేరుకొని అదును చూసి నిందితుడి వద్ద నుంచి తుపాకీ లాక్కున్నారు. అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. నిందితుడు దాడి చేసినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఎదురొడ్డి నిలిచారు. ఆ తర్వాత నిందితుడు తప్పించుకొని పారిపోయాడు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించగా.. సంఘటనా స్థలానికి చేరుకొని విచారించారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, కుటుంబ వివాదంగా పోలీసులు భావిస్తున్నారు.
