తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని హిందుస్థాన్ యూనిలీవర్ చైర్మన్ సంజీవ్ మెహతాను మంత్రి కేటీఆర్ కోరారు. ముంబైలో సంజీవ్ మెహతాతో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న సానుకూలతను ఆయనకు వివరించారు. ఎఫ్ఎంసిజి పరిశ్రమలో అనేక పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని వారికి తెలియజేశారు. మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి మేరకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనున్నట్టు హిందుస్థాన్ యూనిలీవర్ చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, పలువురు పాల్గొన్నారు.
ముంబైలో హిందుస్థాన్ యూనిలీవర్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సంజీవ్ మెహతాతో సమావేశం
తెలంగాణ ఎఫ్ఎంసిజి పరిశ్రమలో హెచ్యుఎల్కు వివిధ సంభావ్య పెట్టుబడి అవకాశాలపై చర్చించారు pic.twitter.com/i8x79HvMEF
— కేటీఆర్ (@KTRTRS) జనవరి 12, 2023
తెలంగాణ పోస్టుల్లో పెట్టుబడులు పెట్టండి. యూనిలీవర్ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ appeared first on T News Telugu
