తెలంగాణలో రెండు రోజులపాటు వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ( ఆదివారం) నుంచి రేపు( సోమవారం) ఉదయం వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉంది.ఈ మేరకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది.
సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఉదయం వరకు రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, ములుగు, నల్గొండలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదైంది.
ఇది కూడా చదవండి: నోటీసులు రద్దు చేయండి.. 26న విచారణకు హాజరుకావడం సాధ్యం కాదు
The post తెలంగాణలో రెండురోజులు వానలు కురిసే అవకాశం appeared first on tnewstelugu.com.
