రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది
15 నుంచి వచ్చే నెల 23వ తేదీ వరకు ఆఫ్ డే స్కూళ్లు కొనసాగనున్నాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పాఠశాలలు పని చేయనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు మధ్యాహ్న భోజనం పెట్టి ఇంటికి పంపించనున్నారు. ఇక టెన్త్ ఎగ్జామ్స్ కు కేటాయించిన పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇది కూడా చదవండి:రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి షాక్.. కోదండరాం, అలీఖాన్ నియామకం చెల్లదన్న హైకోర్టు
