Telangana | తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 14 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం పలు అంశాలపై దాదాపు రెండున్నర గంటలసేపు చర్చించింది. ఈ సందర్భంగా 14 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.

గవర్నర్ ఓటా ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలోనూ తెలంగాణ కేబినెట్ చర్చించినట్లు తెలుస్తోంది. ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ పేర్లను ఎమ్మెల్సీలుగా ప్రతిపాదిస్తూ మరోసారి గవర్నర్ తమిళిసైకి పంపించాలని మంత్రివర్గం తీర్మానించింది.