తెలంగాణ పదేళ్ల వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌లో తెలంగాణ 2కే రన్ నిర్వహించారు. ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రన్‌ను మంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు.

హైదరాబాద్: తెలంగాణ పదేళ్ల వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌లో తెలంగాణ 2కే రన్ అట్టహాసంగా జరిగింది. ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రన్‌ను మంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు.

కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, క్రీడాకారులు నిఖత్ జరీన్, ఈషా సింగ్, గాయని మంగ్లీ, రామ్ మిర్యాల, సినీ నటి శ్రీలీల పాల్గొన్నారు. ఈ రన్నింగ్ ఈవెంట్లో 4,000 మందికి పైగా రన్నర్లు పాల్గొన్నారు. గాయకులు మున్లే మరియు రామ్ తమ గానంతో రన్నర్ల హృదయాలను హత్తుకున్నారు.

