ప్రతిపక్షంలో ప్రధాని మోదీ కంటే అనుభవజ్ఞులైన నాయకులు ఉన్నారని బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు.

పాట్నా: ప్రతిపక్షంలో ప్రధాని మోదీ కంటే అనుభవజ్ఞులైన నాయకులు ఉన్నారని బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు. ఈ నెల 23న పాట్నాలో జరిగే బీజేపీయేతర నేతల సమావేశంలో ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను చెబుతారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎలా ఎదుర్కోవాలో చర్చిస్తామని చెప్పారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను ప్రధాని మోదీ పేరుతో కాకుండా ప్రజల సమస్యలనే ఇతివృత్తంగా నిర్వహిస్తామని వెల్లడించారు.
జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి సీఎం నితీశ్ కుమార్ కేంద్రంలోని అధికార బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన పలువురు ప్రతిపక్ష నేతలను కలిశారు. విపక్షాల ఐక్యతను చాటేందుకు జూన్ 23న పాట్నాలో సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌తో పాటు టీఎంసీ, ఎన్సీపీ, ఆప్ సహా పలు విపక్షాలు ఈ సమావేశంలో పాల్గొననున్నాయి.
Chrome 2
Chrome 3

