తైవాన్ లో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్ర రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదు అయ్యింది. సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంపం కారణంగా అనేక భవనాలు కూడా దెబ్బతిన్నాయి. తైవాన్ రాజధాని తైపీలో బుధవారం ఉదయం బలమైన భూకంపం సంభవించినట్లు తైవాన్ సెంట్రల్ మెటీరియోలాజికల్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. భూకంపం తర్వాత జపాన్ వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. మొదటి సునామీ తన రెండు దక్షిణ దీవులను తాకినట్లు జపాన్ చెబుతోంది.దక్షిణ ద్వీప సమూహం ఒకినావాకు జపాన్ సునామీ హెచ్చరికను జారీ చేసింది.
#WATCH | An earthquake with a magnitude of 7.2 hit Taipei, the capital of Taiwan.
Visuals from Beibin Street, Hualien City, Hualien County, eastern Taiwan.
(Source: Focus Taiwan) pic.twitter.com/G8CaqLIgXf
— ANI (@ANI) April 3, 2024
భూకంపం కారణంగా తైవాన్‌లో భవనాలు కుప్పకూలాయి. కూలిన భవనాల శిథిలాల కింద ప్రజలు చిక్కుకుపోయారు. భూకంప కేంద్రానికి సమీపంలో తైవాన్ తూర్పు తీరంలో ఉన్న హువాలియన్ నగరంలో నష్టాన్ని నివేదించింది.
#WATCH | An earthquake with a magnitude of 7.2 hit Taipei, the capital of Taiwan.
(Source: Reuters) pic.twitter.com/SkHBHrluaZ
— ANI (@ANI) April 3, 2024
యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, భూకంప కేంద్రం హువాలియన్ నగరానికి దక్షిణంగా 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. 25 ఏళ్లలో తైవాన్‌లో సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపం ఇదేనని అధికారులు తెలిపారు. ఫిలిప్పీన్స్ నుండి కూడా సునామీ హెచ్చరిక జారీ అయ్యాయి.
ఇది కూడాచదవండి: తెలంగాణలో 8వ తేదీ నుంచి ఎస్‌ఏ-2 పరీక్షలు
The post తైవాన్‌లో భారీ భూకంపం..రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదు..సునామీ హెచ్చరికలు జారీ.! appeared first on tnewstelugu.com.