ఆమీర్‌ఖాన్ ‘దంగల్’ సినిమాలో నటించిన బాలనటి సుహానీ భట్నాగర్(చిన్నప్పటి బబిత పాత్రధారి) చనిపోయింది. ఆమె వయసు 19 ఏళ్ళు. ఈ విషయాన్ని ఆమీర్‌ఖాన్ ప్రొడక్షన్స్ కూడా తెలిపింది. కొన్ని రోజుల క్రితం కాలికి గాయమవడంతో ఆమె చికిత్స తీసుకుంటోంది. ఈ క్రమంలో సుహానీ వాడుతున్న మెడిసిన్స్ ఇన్ ఫెక్షన్ కావడంతో ఆమె తుది శ్వాస విడిచినట్లు సమాచారం.
కాలికి గాయం కావడంతో సుహానీ ఢిల్లీ ఎయిమ్స్ లో కొద్దిరోజులు చికిత్స తీసుకుంది. ఈ క్రమంలో ఆమె వాడిన మందులు ఇన్ ఫెక్షన్ కావడంతోనే ఆమె చనిపోయినట్లు ఆంగ్ల మీడియా కథనాలు చెబుతున్నాయి. దంగల్ సినిమా తర్వాత పలు ప్రకటనల్లోనూ సుహానీ నటించింది. 2019 జూన్ నుంచి సినిమాలు, షూటింగ్‌లకు పూర్తిగా దూరంగా ఉంటూ చదువుపైనే దృష్టి పెట్టింది. అంతేకాదు, సోషల్‌మీడియాకూ దూరంగా ఉంది. నవంబర్ 2021న ఆమె చివరి పోస్ట్ చేసింది. సుహానీ మృతిపై చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేశారు.
ఇది కూడా చదవండి: మా ముఖాలను కూడా అసెంబ్లీ టీవీలో చూపించండి
