Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

దక్షిణాదిపై వివక్ష

TelanganapressBy TelanganapressMarch 30, 2024No Comments

Gandhi
  • రూపాయి ఇచ్చే బీహార్‌కు కేంద్రం ఇస్తున్నది 7 రూపాయలు
  • అదే రూపాయి ఇస్తున్న తెలంగాణకు అర్ధరూపాయీ ఇవ్వట్లే
  • తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ర్టాల పరిస్థితి కూడా ఇంతే
  • న్యాయంగా రావాల్సిన వాటాలోనూ కేంద్రం మొండిచేయి
  • జనాభా, తక్కువ తలసరి గీటురాయిగా ఏకపక్ష నిబంధనలు
  • 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ రూల్స్‌తో దక్షిణాది రాష్ర్టాలకు నష్టం

(స్పెషల్‌ టాస్క్‌ బ్యూరో) హైదరాబాద్‌, మార్చి 30 (నమస్తే తెలంగాణ): కేంద్ర పన్ను రాబడిలో దక్షిణాది రాష్ర్టాలకు న్యాయంగా రావాల్సిన వాటా దక్కట్లేదు. ఉత్తరాది రాష్ట్రం బీహార్‌ వివిధ పన్నుల ద్వారా కేంద్రానికి రూపాయి ఇస్తున్నదనుకొంటే, దానికి ప్రతిగా కేంద్రం.. ఆ రాష్ర్టానికి రూ. 7.26 తిరిగి చెల్లిస్తున్నది. ఇదే సమయంలో అదే రూపాయి ఇస్తున్న తెలంగాణకు కేవలం 0.47 పైసలనే విదిలిస్తున్నది.

ఒక్క తెలంగాణకే కాదు.. దక్షిణాది రాష్ర్టాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ విషయంలోనూ ఇలాగే పక్షపాతధోరణి అవలంబిస్తున్నది. అందుకే, కేంద్ర పన్నుల్లో తమకు తక్కువ వాటా ఇస్తున్నారని తమిళనాడు, కేరళ, కర్ణాటక తదితర దక్షిణాది రాష్ర్టాల ముఖ్యమంత్రులు కేంద్రప్రభుత్వంపై ఎప్పటి నుంచో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీడీపీలో 32 శాతం మేర వాటాని కలిగి ఉన్నప్పటికీ, దక్షిణాది రాష్ర్టాలకు ఇచ్చే ఆదాయంలో పక్షపాతం ఎందుకు జరుగుతున్నది? 15వ ఆర్థిక సంఘం సిఫారసులతో దక్షిణాదికి జరుగుతున్న నష్టమేంటి?

నిధుల కేటాయింపులు ఇలా..
రాష్ర్టాల సమూహమే దేశం. అంటే కేంద్రప్రభుత్వానికి ఆదాయమంటూ వస్తే అది రాష్ర్టాల నుంచే రావాలి. అలా రాష్ర్టాల నుంచి సేకరించిన నిధులు కేంద్రానికి వెళ్ళిన తర్వాత కొన్ని ప్రమాణాలకు అనుగుణంగా కొంత మొత్తంలో రాష్ర్టాలకు తిరిగి పంపిణీ అవుతాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 280 ప్రకారం.. ఈ నిధుల కేటాయింపులను నిర్ణయించడానికి ప్రతీ ఐదేండ్లకు ఓసారి ఆర్థిక సంఘాలను (ఫైనాన్స్‌ కమిషన్‌) ఏర్పాటు చేస్తారు.

కమిషన్‌పై నిర్ణయాధికారం కేంద్రానిదే. ఈ ఫైనాన్స్‌ కమిషన్‌ సిఫారసుల ఆధారంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు పంచుకొంటాయి. ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం సిఫారసులు (2021-2026) అమలులో ఉన్నాయి. అయితే, 14వ ఆర్థిక సంఘం ఉన్నంత వరకు కేంద్రం ఆదాయంలో 42 శాతం వాటా రాష్ర్టాలకు పంపిణీ అయ్యేది. 15వ కమిషన్‌ సిఫారసుల్లో ఈ వాటాను 41 శాతానికి తగ్గించారు.

ప్రమాణాలు ఏమిటంటే?
15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం.. ఆరు ప్రమాణాలను బట్టి రాష్ర్టాలకు నిధుల పంపిణీ జరుగుతున్నది. రాష్ర్టాల విస్తీర్ణం (15%), రాష్ర్టాల జనాభా (15%), అత్యల్ప తలసరి ఆదాయం (45%), అటవీ, పర్యావరణం (10%), పన్ను వసూలులో రాష్ర్టాల సామర్థ్యం (2.5%), జనాభా నియంత్రణలో రాష్ర్టాల పనితీరు (12.5%)ను బట్టి ఈ కేటాయింపులు చేస్తున్నారు.

అయితే, 10వ, 11వ, 12వ, 13వ, 14వ ఆర్థిక సంఘాలు రాష్ర్టాల జనాభాను 1971 సంవత్సర లెక్కల ప్రకారం తీసుకొంటే, 15వ ఆర్థిక సంఘం మాత్రం 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకొన్నది. అలాగే, నిధుల పంపిణీలో మారిన పరిస్థితులను బట్టి కాకుండా అత్యల్ప తలసరి ఆదాయం ఉన్న రాష్ర్టాలకు 45 శాతం వాటాను కేటాయించింది. ఈ రెండు కారణాల వల్లే.. కేంద్రానికి అత్యధిక రాబడిని వచ్చేలా చేసినప్పటికీ, దక్షిణాది రాష్ర్టాలకు నిధుల పంపిణీలో అన్యాయం జరుగుతున్నది.

జనాభా, రాబడిలో మార్పులు ఇలా..
70వ దశకం మధ్యలో జనాభా పెరుగుదలను నియంత్రించే ప్రయత్నాలను కేంద్రం తీవ్రతరం చేసింది. జననాలను కట్టడి చేసే రాష్ర్టాలకు ప్రోత్సాహకాలను ప్రకటించింది. దీంతో దక్షిణాదిన ఉన్న కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాలు జనాభా నియంత్రణను చేపడితే.. ఉత్తరాది రాష్ర్టాల్లో అలా జరగలేదు. దీంతో ఉత్తరాదిన జనవిస్ఫోటనం జరిగింది.

పరిశ్రమల స్థాపన, ఉద్యోగావకాశాలు తదితర అభివృద్ధి పనులు దక్షిణాదిన ఊపందుకొని ప్రజల తలసరి ఆదాయం పెరిగితే, ప్రభుత్వాల వైఫ్యల్యం కారణంగా యూపీ, బీహార్‌ వంటి ఉత్తరాది రాష్ర్టాల్లో అలా జరుగలేదు. దీంతో జనాభాలో 19 శాతం వాటా కూడా లేని దక్షిణాది రాష్ర్టాలు .. ప్రస్తుతం జీడీపీలో 32 శాతం వాటాని కలిగిఉన్నాయి. 1976 తర్వాత ఏర్పాటైన ఫైనాన్స్‌ కమిషన్లు (10వ ఫైనాన్స్‌ కమిషన్‌ నుంచి) 1971 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకొన్నాయి.

14వ ఆర్థిక సంఘం వరకు ఇదే పద్దతి కొనసాగింది. ఆ లెక్కన జనాభా నియంత్రణ పాటించకముందు ఉన్న జనాభా లెక్కలను తీసుకోవడంతో రాబడి వాటాల్లో దక్షిణాదికి కొంత మేర న్యాయం జరిగింది. కానీ, 15వ ఆర్థిక సంఘం తాజా జనాభా లెక్కలను (2011నాటి జనాభా లెక్కలు) ఉపయోగిస్తున్నది. అంతేకాకుండా.. 2011నాటి రాష్ర్టాల జనాభాకు, అత్యల్ప తలసరి ఆదాయం ఉన్న రాష్ర్టాలకు 60 శాతం మేర ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో జనాభా నియంత్రణ పాటించి, పౌరుల తలసరి ఆదాయాన్ని పెంచిన దక్షిణాది రాష్ర్టాలకు అన్యాయం జరిగింది.

జనాభా నియంత్రణలో మంచి పనితీరు కనబర్చిన రాష్ర్టాలకు 12.5% పాయింట్లు ఇస్తామన్నప్పటికీ, దీనికి 1971 కాకుండా 2011వ సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకొన్నారు. అలా కూడా దక్షిణాది రాష్ర్టాలకు నష్టమే మిగిలింది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే.. జనాభాను నియంత్రించకుండా, పౌరుల ఉపాధి కల్పనను గాలికొదిలేసి వారి తలసరి ఆదాయానికి గండికొట్టిన ఉత్తరాది రాష్ర్టాలకే కేంద్రం ఎక్కువ నిధులను కేటాయిస్తున్నది. అందుకే, దక్షిణాది రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఈ పరిణామాన్ని ఖండిస్తున్నారు. దేశాభివృద్ధికి చోదకశక్తిగా పనిచేస్తున్న దక్షిణాది రాష్ర్టాలకు న్యాయంగా దక్కాల్సిన వాటాను ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు.

నష్టాలు ఇలా..
10వ, 15వ ఆర్థిక సంఘం చేసిన సి ఫారసులను పోల్చిచూస్తే దక్షిణాదికి జ రుగుతున్న అన్యాయం స్పష్టమవుతున్నది. 2022-23 ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే తెలంగాణ, ఏపీకి కేంద్రం నుంచి న్యాయంగా రావాల్సిన నిధుల్లో రూ. 23,604 కోట్లు కోత పడ్డాయి. ఇ క, తమిళనాడుకు రూ. 21,284 కోట్లు , కేరళకు రూ. 16,176 కోట్లు, కర్ణాటకకు రూ. 13,346 కోట్లు నషం వాటిల్లింది. ఇదే సమయంలో మధ్యప్రదేశ్‌.. రూ. 33,855 కోట్లు, యూపీ.. రూ. 12,049 కోట్లు, బీహార్‌.. రూ. 13, 883 కోట్లు అదనంగా లబ్ధిపొందాయి.

ఒక్కో రాష్ట్రం నుంచి ఒక్కో రూపాయి చొప్పున రాబడి వస్తే.. తిరిగి ఏ రాష్ర్టానికి కేంద్రం ఎంత ఇస్తున్నదంటే? (2023-24 ఆర్థిక సంవత్సరం)

రాష్ట్రం : చెల్లింపులు(రూ.ల్లో)
బీహార్‌ : 7.26
ఉత్తరప్రదేశ్‌ : 2.49
మధ్యప్రదేశ్‌ : 2.09
ఒడిశా : 1.25
రాజస్థాన్‌ : 1.20
కేరళ : 0.62
ఆంధ్రప్రదేశ్‌ : 0.52
తెలంగాణ : 0.47
తమిళనాడు : 0.28
కర్ణాటక : 0.17

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.