హైదరాబాద్ శివారులోని దుండిగఢ్‌లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. దుండిగల్ సమీపంలో వేగంగా వస్తున్న డీసీఎం బోల్తా పడింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
గుడవిలి నుంచి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ గార్డెన్స్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
