వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని లింగాపురం గ్రామంలోని వ్యవసాయ భూమిలో ట్రాక్టర్ దున్నుతుండగా ప్రమాదవశాత్తు బావిలో పడింది.

వరంగల్: వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని లింగాపురం గ్రామంలోని వ్యవసాయ భూమిలో ట్రాక్టర్ దున్నుతుండగా ప్రమాదవశాత్తు బావిలో పడింది. దీంతో డ్రైవర్ నీటిలో మునిగిపోయాడు. ట్రాక్టర్ డ్రైవర్ అజ్మీరా కీమా శుక్రవారం తెల్లవారుజామున లింగాపురం శివారులో పొలాలను దున్నుతున్నాడు. రివర్స్ చేస్తుండగా ఇంజన్‌తో బావిలో పడిపోయాడు.
ట్రాక్టర్ బావిలో పడి ఇంజన్‌తోపాటు నీటమునిగి చనిపోయాడు. అతను తక్షణమే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో ట్రాక్టర్‌ను బయటకు తీయడానికి ప్రయత్నించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

