
ధర్మపురి: తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్మపురి నియోజకవర్గం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ధర్మపురిలో రూ.660 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. మన బస్తీ – మనబడి పథకంలో భాగంగా టౌన్షిప్లో ప్రభుత్వ పాఠశాలలు, అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన, రూ.3 లక్షలతో మేరు సంగం భవన్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
ఈమేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ విద్యా రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. విద్యా విధానంలో అనేక మార్పులు వచ్చాయని, అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించిందన్నారు. విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో ధర్మపురి మున్సిపల్ చైర్మన్ సంగి సత్తమ్మ, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, జెడ్పీటీసీ బత్తిని అరుణ, ఎంపీపీ చిట్టిబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉదయేరి రాజేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.
