తెలంగాణ | న్యూఢిల్లీ: జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డుల ప్రదానోత్సవం గురువారం ఇస్తానాలో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఏఎన్ఎం తేజావత్ సుశీల అవార్డును అందుకున్నారు.

తెలంగాణ | న్యూఢిల్లీ: జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డుల ప్రదానోత్సవం గురువారం ఇస్తానాలో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఏఎన్ఎం తేజావత్ సుశీల అవార్డును అందుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎర్రగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్ఎంగా సుశీల విధులు నిర్వహిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులకు 26 ఏళ్లుగా వైద్యసేవలు అందించినందుకే తనకు ఈ అవార్డు వచ్చిందని సుశీల తెలిపారు.

