మేడే-2023 వేడుకలను మే 1న ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే వేడుకలకు సీఎం కేసీఆర్, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి హాజరుకానున్నారు.

- సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు
హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం 2023 మే డేను మే 1న ఘనంగా నిర్వహించనుంది. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే వేడుకలకు సీఎం కేసీఆర్, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి హాజరుకానున్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ఉన్నతాధికారులు, యాజమాన్యాలు, సంఘాల ప్రతినిధులు పాల్గొంటారు. కార్మికులు మేడే వేడుకల్లో చురుగ్గా పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
