
హైదరాబాద్ : ఈ నెల 5న నాందేడ్ లో బీఆర్ ఎస్ పార్టీ బహిరంగ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే బాల్క సుమన్, జోగు రామన్న, హన్మంత్ షిండే, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్ సభ ఏర్పాట్లను పరిశీలించారు.
కార్యక్రమంలో పలువురు నాందేడ్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన వివిధ పార్టీల నేతలు బీఆర్ ఎస్ లో చేరనున్నారు. నాందేడ్ సభ ఏర్పాట్లలో భాగంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శనివారం నాందేడ్ జిల్లాలో పర్యటించారు. అప్పారావు పేట్, శివిని, ఇస్లాపూర్, హిమాయత్ నగర్ గ్రామాల్లో పర్యటించారు.
మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అడుగడుగునా స్థానిక ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. కాలనీకి వెళ్లి వృద్ధులతో ముచ్చటించారు. మహారాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదని, తెలంగాణలో అమలు చేసిన కార్యక్రమాలను అమలు చేయాలని కోరారు.
ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ తెలంగాణ వంటి సంక్షేమ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ బీఆర్‌ఎస్ జాతీయ పార్టీని స్థాపించారన్నారు. నాందేడ్ సభకు భారీగా హాజరై విజయవంతం చేయాలని కోరారు.
