నిరుద్యోగులకు శుభవార్త. నవోదయ విద్యాలయ సమితి భారీగా ఖాళీలనకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాుప 14వందల నాన్ టీచింగ్ పోస్టుల కోసం ఆహ్వానిస్తోంది. ఈరిక్రూట్ మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ navodaya.gov.in సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు రుసుమును చెల్లించవచ్చు.
అధికారిక షెడ్యూల్ ప్రకారం, NTA మే 02 నుండి 04 వరకు మూడు రోజుల పాటు నవోదయ విద్యాలయ సమితి దరఖాస్తు ఫారమ్ దిద్దుబాటు విండోను తెరుస్తుంది. నవోదయ విద్యాలయ సమితి అడ్మిట్ కార్డ్, పరీక్ష తేదీని NTA తన అధికారిక వెబ్‌సైట్‌లో త్వరలో ప్రకటిస్తుంది.నవోదయ విద్యాలయ సమితి రిక్రూట్‌మెంట్ డ్రైవ్ స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (HQ/RQ కేడర్), మెస్ హెల్పర్, ల్యాబ్ అటెండెంట్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్ వంటి మొత్తం 14వందల నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, లేడీ స్టాఫ్ నర్స్, క్యాటరింగ్ సూపర్‌వైజర్, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, లీగల్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉన్నాయి.
ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో ఇచ్చిన ఇమెయిల్ చిరునామా, మొబైల్ నంబర్ తమదేనని అభ్యర్థులు నిర్ధారించుకోవాలని సూచించారు. ఎన్టీఏ నుండి అన్ని సమాచారాలు రిజిస్టర్డ్ ఇమెయిల్ చిరునామాకు ఇమెయిల్ ద్వారా లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు మెసేజ్ వస్తుంది. ఎన్వీఎస్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్‌కు దరఖాస్తు చేస్తున్నప్పుడు ఎవరైనా అభ్యర్థులు ఇబ్బందులను ఎదుర్కొంటే వారు సహాయం కోసం 011 – 40759000/011 – 69227700 లేదా [email protected]. వద్ద ఇమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.
ఎలా దరఖాస్తు చేయాలి?
-అభ్యర్థులు నవోదయ విద్యాలయ సమితి నాన్-టీచింగ్ పోస్ట్‌లకు దరఖాస్తు చేయడానికి క్రింద ఇవ్వబడిన దశలను అనుసరించవచ్చు:
-NTA exams.nta.ac.in/NVS/ లేదా navodaya.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
-హోమ్ పేజీలో “రిజిస్ట్రేషన్/లాగిన్” ట్యాబ్‌ను చూడండి.
-ఇప్పుడు కొత్త విండో ఒపెన్ అవుతుంది. నమోదు ప్రక్రియను పూర్తి చేయండి.
-రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయంలో రూపొందించిన ఆధారాలను ఉపయోగించి లాగిన్ చేయండి.
-దరఖాస్తు ఫారమ్‌ను పూరించి ఫీజు చెల్లించండి.
-కాపీని డౌన్‌లోడ్ చేయండి. భవిష్యత్తు అవసరాల కోసం మీ వద్ద ఉంచుకోండి.
ఇది కూడా చదవండి: ఇద్దరు సీఎంలను అరెస్ట్ చేసిన ఈడీ అధికారి కపిల్ రాజ్ ఎవరు?