పరారీలో ఉన్న భారతీయ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి బ్రిటన్ కోర్టులో చుక్కెదురైంది. అవకతవకలు, మనీలాండరింగ్‌పై విచారణ జరిపేందుకు తనను భారత్‌కు అప్పగించాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని నివార్ మోడీ చేసిన విజ్ఞప్తిని అక్కడి కోర్టు ఈరోజు (గురువారం) తోసిపుచ్చింది.
2018లో, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో భారీ మోసానికి పాల్పడిన తర్వాత నీరవ్ మోడీ భారతదేశం నుండి పారిపోయాడు. మోడీని ఇండియాకు తీసుకెళ్తే ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉందని తరపు లాయర్ చెప్పినట్లు తెలుస్తోంది.
