హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో కొనసాగుతున్న ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్) ఇవాళ్టి( ఆదివారం)తో ముగియనుంది. నిన్న(శనివారం) నాటికి సందర్శకుల సంఖ్య దాదాపు 20 లక్షలు దాటింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో దాదాపు 2400 స్టాల్స్ తో ప్రతీ ఏడాది జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఈసారి స్టాల్ హోల్డర్ల విజ్ఞప్తి మేరకు నుమాయిష్ ను మూడు రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, మంత్రి డి.శ్రీధర్ బాబు ప్రకటించారు. దీంతో నుమాయిష్ 18న ముగియనుంది.
ఇది కూడా చదవండి: అత్తమ్మాస్ కిచెన్… ఫుడ్ బిజినెస్ లోకి ఉపాసన, కొణిదెల సురేఖ
