
రాష్ట్ర ప్రభుత్వం రెండు ఎకరాల స్థలంలో సకల సౌకర్యాలతో నిర్మించనున్న.. ఉప్పల్ భగాయత్.. క్రైస్తవ భవనానికి నేడు శంకుస్థాపన జరగనుంది. అన్ని కులాల వారికి స్థలాలు కేటాయిస్తున్న ప్రభుత్వం ఉప్పల్ భగాయత్ లో క్రైస్తవులకు కూడా 2 ఎకరాల భూమిని కేటాయించి రూ.2 కోట్లతో నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఉదయం 11 గంటలకు జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాసయాదవ్, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డితోపాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేట్ సంస్థలు, క్రైస్తవ పెద్దలు, బిషప్లు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
