లోక సభ ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థులను పార్టీ అధిష్టానం నేడు ప్రకటించనుంది. ఇప్పటికే పలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ఆపార్టీ హైకమాండ్ సమీక్షలు నిర్వహించింది. ఈ సమీక్షలోపార్టీ శ్రేణులు తెలిపిన అభిప్రాయాలతోపాటు సర్వే రిపోర్టుల ఆధారంగా గులాబీ బాస్ అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
2019 ఎన్నికల్లో తెలంగాణ నుంచి 9 పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ భారీ విజయం సాధించింది. అయితే3 ఎంపీలు ఇప్పటికే పార్టీ మారారు. పెద్ద పల్లి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, భువనగిరి పార్లమెంట్ నుంచి జిట్టా బాలకృష్ణారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి తలసాని సాయి కిరణ్ ను బరిలోకి దింపే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: నేటి నుంచి డీఎస్సీ ఆన్ లైన్ దరఖాస్తులు..!
