
భారత్ తన రెండో టీ20లో నేడు శ్రీలంకతో తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని భారత్ కోరుకుంటోంది. తొలి టీ20 మ్యాచ్లో ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో భారత్ ఎట్టకేలకు విజయం సాధించింది. కానీ ప్రధాన బ్యాట్స్మెన్ పేలవ ప్రదర్శనతోనూ… దీపఖుడా, అక్షర్ పటేల్ మెరుపుతో భారత్ విజయం సాధించింది. రెండో టీ20లో టాప్ బ్యాట్స్ మెన్ రాణిస్తే భారత్ కు పునరాగమనం తప్పదు. కెప్టెన్ హార్థిక్ పాండ్యా సారథ్యంలో భారత జట్టు జోరుమీదుంది. తొలి టీ20లో తృటిలో ఓడిపోయిన లంక మళ్లీ పుంజుకోవాలని భావిస్తోంది. రాత్రి 7 గంటలకు పూణె వేదికగా జరిగే ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో వేచి చూడాల్సిందే.
