తాను బీఆర్ఎస్ నుంచి మారుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని ఖండించారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. బీఆర్ఎస్ పార్టీని వీడటం లేదని స్పష్టం చేశారు. పార్టీ మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు. అదేవిధంగా లోకసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్న దానం నాగేందర్, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిని తాను కాదని స్పష్టం చేశారు. ఏదైనా నేతలు, కార్యకర్తలతో చర్చించిన తర్వాతే తాను రాజకీయ నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
కాగా రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ తో ఎమ్మెల్యే దానం నాగేందర్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆయన పార్టీ మారడాన్ని అంగీకరించారని..సికింద్రాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు అంగీకరించినట్లు వార్తలు వినిపించాయి. అంతేకాదు ఈనెల 18న కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం కూడా జరిగింది. ఈ తరుణంలో తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై దానం స్పందించారు. తానే ఏపార్టీలోకి వెళ్లడం లేదని బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని కోరారు.
ఇది కూడా చదవండి: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. హాల్‌టికెట్ నంబర్లు ప్రతి పేజీపై రాయాల్సిందే.!
