ఒకప్పుడు భారతీయ సినీ పరిశ్రమలో ఒక వెలుగు వెలిగారు అగ్ర కథానాయిక దివంగత నటి శ్రీదేవి. ఆమె బయోపిక్ రానున్నట్లు గతకొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే దానిపై త్రీవంగా స్పందించారు ఆమె భర్త బోనీ కపూర్. ఆయన నిర్మించిన తాజా చిత్రం ప్రమోషన్స్ లో ఈ బయోపిక్ గురించి మాట్లాడారు.
నా భార్య చాలా ప్రైవేట్ పర్సన్. ఆమె వ్యక్తిగత విషయాలు బయటకు చెప్పడానికి ఇష్టపడేది కాదు. జీవితమంతా అలానే ఉంది. ఇప్పుడు ఆ పర్సనల్ విషయాలు బయటకు చెప్పడానికి నేను అంగీకరించను. నేను బతికి ఉన్నంతవరకు బయోపిక్‌కు అనుమతివ్వను అని బోనీ కపూర్ స్పష్టం చేశారు.
బాలనటిగా సినీ జీవితం మొదలుపెట్టి అగ్రహీరోలందరి సరసన నటించారు శ్రీదేవి. తన నటనతో అన్ని భాషల్లోని సినీప్రియులను అలరించి ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాధించుకుంది. ఆమె నటనకు ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. ఈ అగ్రకథానాయిక జీవితంలో చోటుచేసుకున్న కొన్ని ఆసక్తికర విషయాలపై ప్రముఖ పరిశోధకుడు, రచయిత ధీరజ్, శ్రీదేవి బయోగ్రఫీని రచించనున్నారు. ‘‘ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్’’ పేరుతో ఇది రానుంది. దీనికోసం శ్రీదేవి కుటుంబ సభ్యుల పర్మిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాల్లో రెండు నెలల పాటు సమ్మర్ స్పెషల్ రైళ్లు
The post నేను బతికి ఉండగా శ్రీదేవి బయోపిక్‌కు అంగీకరించను appeared first on tnewstelugu.com.