ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్ దూకుడు పెంచారు. అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన సిద్ధం భారీ బహిరంగసభలో జగన్ ప్రసంగించారు. విపక్షనేతలు, చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై పంచ్ ల వర్షం కురిపించారు. చంద్రబాబు పేరు చెబితే రైతులకు గుర్తొచ్చే పథకం ఒక్కటి కూడా లేదన్నారు. నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్, మనకు మధ్య యుద్ధం జరుగబోతుందన్నారు. 14ఏళ్ల పాలనలో చంద్రబాబు ఏ ప్రాంతానికైనా న్యాయం చేశారా అంటూ జగన్ దుయ్యబట్టారు. సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే వైసీపీ సర్కారే మళ్లీ రావాలని జగన్ పేర్కొన్నారు.
ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలని…సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలని..తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింగ్ లోనే ఉండాలంటూ జగన్ సెటైర్లు వేశారు. గతంలో ఏనాడూ చూడని మార్పులు నేడు తెచ్చామని జగన్ అన్నారు. విద్యావ్యవస్థలోసమూల మార్పులు తీసుకొచ్చామని జగన్ పేర్కొన్నారు. కోవిడ్ కష్టకాలంలోనూ అందించిన సేవలు గుర్తొస్తాయని జగన్ అన్నారు. పెన్షన్ కొనసాగాలంటే..మీ బిడ్డ ప్రభుత్వమే రావాలన్నారు. ఒక్కసారి ఛాన్స్ ఇస్తేనే ఎన్ని పనులు చేశామో శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. మళ్లీ అవకాశం ఇస్తే ఇంకెంత మంచి జరుగుతుందో ఆలోచించాలన్నారు. 75శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పదవుల్లో ప్రాధాన్యతనిచ్చామని జగన్ వెల్లడించారు. కేవలం 57నెలల కాలంలోనే 2లక్షల 13వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం తెలిపారు.
ఎల్లో మీడియా దుష్ప్రచారాలను తిప్పికొట్టేందుకు మీరు సిద్ధమా అంటూ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఎల్లో మీడియా చీకటి రాతలను తిప్పికొట్టేందుకు మీరు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. సమరభేరి మోగిద్దాం..సమరనినాదం వినిపిద్దాంమటూ మరింత జోష్ నింపారు. మరో చారిత్రాత్మక విజయాన్ని అందుకునేందుకు మీరు సిద్ధమాఅంటూ ప్రశ్నించారు. ఈ ఎన్నికల తర్వాట టీడీపీ రూపురేఖలు ఎక్కడా కనిపించవని..పెత్తందారులంతా తోడేళ్లుగా ఏకమవుతున్నారని చురకలంటించారు జగన్.
ఇది కూడా చదవండి: తెలంగాణలో డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు..!!
The post పంచ్లతో సైకిల్ గాలి తీసిన జగన్..పాపం గ్లాస్ పరిస్థితి దారుణం…!! appeared first on tnewstelugu.com.
