
న్యూఢిల్లీ: ట్రాఫిక్ ప్రమాదంలో గాయపడిన స్టార్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌ను మెరుగైన చికిత్స కోసం ముంబైకి తరలించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. గాయపడిన భాగానికి శస్త్రచికిత్స చేయాల్సి ఉన్నందున పంత్‌ను ఎయిర్ అంబులెన్స్‌లో ముంబైకి తరలించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా బుధవారం విలేకరులకు తెలిపారు.
ముంబైలోని అంబానీ ఆస్పత్రిలో ప్రముఖ వైద్యురాలు దిన్షా పార్దీవాలా ఆధ్వర్యంలో పంత్‌కు శస్త్రచికిత్స జరగనుంది. పంత్ కోర్ కాంట్రాక్ట్ ప్లేయర్ అయినందున అతనికి వైద్యం అందించడం తమ బాధ్యత అని బోర్డు పేర్కొంది.
