Man’s firecracker stunt | పెళ్లి వేడుకలో పాల్గొన్న మద్యం తాగిన వ్యక్తి అతిగా ప్రవర్తించాడు. కాలుతున్న పటాకుల పెట్టెను తలపై పెట్టుకుని డ్యాన్స్ చేశాడు. క్రాకర్స్ మంటలు అతడి దుస్తులకు అంటుకోవడంతో దానిని కిందపడేశాడు. దీంతో అక్కడున్న వారు భయంతో పరుగులు తీశారు.
న్యూఢిల్లీ: పెళ్లి వేడుకలో పాల్గొన్న మద్యం తాగిన వ్యక్తి అతిగా ప్రవర్తించాడు. కాలుతున్న పటాకుల పెట్టెను తలపై పెట్టుకుని డ్యాన్స్ చేశాడు. (Man’s firecracker stunt) క్రాకర్స్ మంటలు అతడి దుస్తులకు అంటుకోవడంతో దానిని కిందపడేశాడు. దీంతో అక్కడున్న వారు భయంతో పరుగులు తీశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మద్యం సేవించిన ఒక వ్యక్తి పెళ్లి ఊరేగింపులో పాల్గొన్నాడు. కాలుతున్న క్రాకర్స్ పెట్టెను తలపై పెట్టుకుని డ్యాన్స్ చేశాడు. కొందరు యువకులు కూడా కలిసి డ్యాన్స్ చేస్తూ అతడ్ని ఎంకరేజ్ చేశారు.
కాగా, క్రాకర్స్ నుంచి వచ్చిన మంటలు ఆ వ్యక్తి దుస్తులకు అంటుకున్నాయి. దీంతో కంగారులో అదుపు తప్పిన అతడు ఉన్నట్టుండి తలపై ఉన్న పటాకుల పెట్టెను ఒక్కసారిగా కింద పడేశాడు. కాలుతున్న క్రాకర్స్ అన్ని వైపులకు దూసుకెళ్లడంతో పెళ్లి ఊరేగింపులో పాల్గొన్న వారు భయాందోళన చెందారు. అక్కడి నుంచి పరుగులు తీశారు. ఒక యూజర్ షేర్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి ప్రవర్తనపై నెటిజన్లు మండిపడ్డారు.
ऐसे खुराफाती लोग ही बारात की लुटिया डुबोते हैं 😅🤣
दो शब्द बोलो इनके बारे में pic.twitter.com/bnU5v3qZ2J— Kartik Meena (@KARTIKMEENA005) April 12, 2024