తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదోతరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2న ముగుస్తాయి. ప్రతిరోజూ ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. అయితే కాపీయింగ్ నివారణకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థికి ప్రశ్నపత్రం ఇవ్వగానే ప్రతి పేజీపై తమ హాల్ టికెట్ నెంబర్ రాయాల్సి ఉంటుంది.
కాగా ప్రశ్నపత్రాలు తారుమారవ్వకుండా ఉండటంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక విద్యార్థులు సిబ్బంది పరీక్ష ముగిసేంత వరకు పరీక్ష కేంద్రాలను విడిచి బయటకు వెళ్లకూడదని ఆదేశించారు. విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్, పెన్, పెన్సిల్, షార్ప్ నర్, ఎరేజర్, జామెట్రీ పరికరాలను అనుమతిస్తారు. సెల్ ఫోన్లు సహా ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలను తీసుకెళ్లడం పూర్తిగా నిషేధించారు. విద్యార్థులు కాపీయింగ్ కు పాల్పడితే డిబార్ చేయనున్నారు. ఇందులో సిబ్బంది పాత్ర ఉంటే వారిపై యాక్ట్ 25 , 1997 సీసీఏ రూల్స్ ప్రకారం చర్యలు ఉంటాయని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: చాలా రోజుల తర్వాత ఏసీ ఆన్ చేస్తారా..?ఈ విషయాలు తెలుసుకోండి.!
