టైటిల్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఈయన ఇండస్ట్రిలో మరో నటుడు పవన్ కల్యాణ్. తాజాగా ఈయన బిగ్ బాస్ తెలుగు సీజన్ 6తో పాపులర్ అయిన వాసంతితో వివాహం చేసుకున్నారు.ఈమె ప్రస్తుతం పలు సీరియల్స్ నటిస్తుంది. కన్నడ చిత్రాల్లోనూ నటిస్తోంది. సిరిసిరి మువ్వలు సీరియల్ తో టెలివిజన్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత గోరింటాకు, గుప్పెడంత మనసు వంటి ధారావాహికలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాలీఫ్లవర్ , మనే నెం. 67, భువన విజయం, సీఎస్ఐ సనాతన్ వంటి సినిమాల్లోనూ నటించింది.
ఈ క్రమంలోనే తన ఫ్రెండ్ పవన్ కల్యాణ్ తో ప్రేమలో పడింది. పవన్ కూడా నటుడేనని పలు కథనాల ద్వారా తెలుస్తోంది. అతను హీరోగా రెండు సినిమాలు చేస్తున్నాడట. అయితే వాటికి సంబంధించి పూర్తి క్లారిటీ లేదు. గతేడాది ఈ జంట డిసెంబర్ లో ఎంగేజ్ మెంట్ చేసుకుంది. ఈ మధ్యే ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో కూడా పాల్గొని సందడి చేశారు. ఆ ఇంటర్వ్యూలో ముద్దులు పెట్టుకుని విమర్శల పాలయ్యారు.
View this post on Instagram
తాజాగా తిరుపతిలో బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఈ వివాహకార్యక్రమానికి కొంతమంది బిగ్ బాస్, సీరియల్ యాక్టర్స్ కూడా హాజరయ్యారు. తమ పెళ్లి ఫొటోలను,వీడియోలను ఇన్ స్టాలో పోస్టు చేశారు.
ఇది కూడా చదవండి: ఫ్లిప్ కార్టులో ఏసీలపై బంపర్ ఆఫర్..స్మార్ట్ ఫోన్ ధరకే ఏసీ కొనవచ్చు..!!
The post పవన్ కళ్యాణ్ తో ఘనంగా బిగ్ బాస్ బ్యూటీ వివాహం..!! appeared first on tnewstelugu.com.
