జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుంటూరు కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేసింది. గతేడాది జులై 9న పవన్ వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారనే ఆరోపణలతో కేసు పెట్టింది. దీంతో 499, 500, ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన జిల్లా కోర్టు.. కేసును నాలుగో అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. ఈనెల 25న విచారణకు రావాలని పవన్ కు జడ్జి నోటీసులిచ్చారు.
వాలంటీర్లు ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి వస్తున్నారనీ, ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారని అన్నారు పవన్ కళ్యాణ్. అంతేకాదు..వాలంటీర్ల కారణంగా ఇళ్లలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతోందనీ, కొంతమంది వాలంటీర్లు బ్లాక్‌మెయిల్స్ కి పాల్పడుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై అప్పట్లోనే అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.
ఇది కూడా చదవండి: దేశంలో మోస్ట్ పాపులర్ సీఎం ఎవరో తెలుసా..
