హైదరాబాద్: అప్పుడే పుట్టిన బిడ్డను అపార్ట్‌మెంట్‌లో వదిలేసి తల్లిదండ్రులు వెళ్లిపోగా.. సమాచారం అందుకున్న కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ ఘటనాస్థలికి చేరుకుని చిన్నారి ప్రాణాలను కాపాడారు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పేరు తెలియని తల్లిదండ్రులు కుషాగూడ పోలీస్ స్టేషన్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నవజాత శిశువును వదిలివెళ్లారు.
పాప ఏడుపు విన్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అపార్ట్‌మెంట్‌కు చేరుకున్న ఎస్‌ఐ సాయికుమార్, అతని బృందం శిశువును చూసి షాక్‌కు గురయ్యారు.
ఎస్‌ఐ సాయికుమార్ స్వయంగా 108 అంబులెన్స్‌లో శిశువును సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యుల పర్యవేక్షణలో చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రుల కోసం సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
