పాకిస్థాన్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌ను తాలిబన్ ఉగ్రవాదులు స్వాధీనం చేసుకున్నారు. యాంటీ టెర్రరిస్ట్ విభాగానికి చెందిన భద్రతా సిబ్బందిని బందీలుగా పట్టుకున్నారు. ఈ ఘటన వాయువ్య పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని బన్నూ క్యాంపులో చోటుచేసుకుంది.
పాకిస్థాన్ తాలిబాన్ మూవ్‌మెంట్ (టీటీపీ)కి చెందిన ఉగ్రవాదులు పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి అతడిని బంధించారని పాక్ పోలీసులు వెల్లడించారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఉన్న ప్రాంతాన్ని పాక్ సైన్యం చుట్టుముట్టిందన్నారు.
