పాకిస్థాన్‌లో ఉగ్రదాడి జరిగింది. మసీదులో బాంబు పేలడంతో 25 మంది చనిపోయారు. 120 మందికి పైగా గాయపడ్డారు. పెషావర్‌లోని స్థానిక పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని మసీదుకు సోమవారం మధ్యాహ్నం 260 మందికి పైగా ప్రార్థనలు చేసేందుకు వచ్చారు. ప్రార్థన జరుగుతుండగా బాంబు పేలింది.
పేలుడు ధాటికి మసీదు పైకప్పు కూలిపోయింది. ఒకవైపు గోడ పూర్తిగా కూలిపోయింది. ఘటనా స్థలంలో రక్తం కారడంతో పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. ఆత్మాహుతి దాడిగా అనుమానిస్తున్నారు.
