
పాన్ కార్డుతో ఆధార్‌ను అనుసంధానం చేసుకునే గడువును కేంద్రం పలుమార్లు పొడిగించింది. ఈసారి 2023 మార్చి 31 గడువుతో ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 31లోగా ఆధార్ అనుసంధానం చేయకుంటే పాన్ కార్డులు పనిచేయవని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆదాయపు పన్ను విభాగం వివరణ ఇచ్చింది. IT చట్టం 1961 ప్రకారం, మినహాయింపు పరిధిలోకి రాని వారు పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయాలి. సాధారణ నిర్దేశిత గడువు ముగిసిందని, గడువు పొడిగింపు దృష్ట్యా, ప్రజలు రూ. 1,000 ఆలస్య రుసుము చెల్లించి పాన్‌తో ఆధార్‌ను అనుసంధానించాల్సి ఉంటుందని ఐటీ శాఖ తెలిపింది.