పాము కాటుకు విరుగుడు కనిపెట్టారు శాస్త్రవేత్తలు. బెంగుళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు సఫలమయ్యారు. అమెరికాకుచెందిన స్కిప్స్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ శాస్త్రవేత్తలుకూడా ఈ పరిశోధనలో పాల్గొన్నారు. పాము కాటు వేసినప్పుడు మానవ రక్తంలోకి విడుదలయ్యే ప్రాణాంతక విషపదార్థాలను నిర్వీర్యం చేసేందుకు మానవ యాంటీబాడీని ప్రయోగశాలలో క్రుతిమంగా క్రియేట్ చేశారు. హెచ్ఐవీ, కోవిడ్ 19 వంటి వైరస్ లను ఎదుర్కొనే యాంటీ బాడీల అధ్యయనం ఈ పరిశోధనను ప్రాతిపదికగా నిలిచింది. తమ సింథటిక్ యాంటీ బాడీ త్రాచుపాము, నాగుపాము, కట్లపాము, బ్లాక్ మాంబా వంటి పాముల విషయాన్ని ఎదుర్కొంటుందని పరిశోధకులు తెలిపారు.
ప్రస్తుతం గుర్రాలు, కంచర గాడిదలకు పాము విషాన్ని ఎక్కించి విరుగుడు మందలు తయారు చేస్తున్నారు. ఈ పద్ధతి ఆ జంతువులకు పరిణమిస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు. తాజా పరిశోధన వల్ల ప్రయోగశాలలోనే సింథటిక్ యాంటీ బాడీలను తయారుచేయడం వీలవుతోందని తెలిపారు.
ఇది కూడా చదవండి: సచివాలయంలో 11.40 దాటిన కానరాని ఉద్యోగులు..!!
