ఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రల్లాద్ జోషి ట్విట్టర్‌లో వెల్లడించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్ 6 వరకు జరగనున్నాయి.
మొదటి దశ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 14 వరకు… రెండో దశ మార్చి 13న ప్రారంభమై ఏప్రిల్ 6 వరకు కొనసాగుతుంది. ఫిబ్రవరి 14 నుండి మార్చి 12 వరకు సమావేశాలు నిలిపివేయబడతాయి.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారి పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 66 రోజుల వ్యవధిలో 27 పనిదినాల పాటు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. సమావేశంలో భాగంగా రాష్ట్రపతి ప్రసంగం, కేంద్ర బడ్జెట్ తదితర అంశాలపై చర్చిస్తామని ప్రహ్లాద్ జోషి తెలిపారు.
